Share News

Train Accident: గూడ్స్ రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు..

ABN , Publish Date - Nov 13 , 2024 | 09:11 AM

పెద్దపల్లి జిల్లా: రాఘవాపూర్‌లో ఐరన్‌ కాయిల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆ మార్గంలో నడిచే 20 రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ట్రాక్ పునరుద్ధరణ జరిగిన తర్వాతే రైళ్లను పునరుద్ధరించే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

Train Accident:  గూడ్స్ రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు..

పెద్దపల్లి జిల్లా: రాఘవాపూర్‌లో ఐరన్‌ కాయిల్స్ (Iron Coils) లోడుతో వెళుతున్న గూడ్స్‌ రైలు (Goods train) పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. పట్టాలపైనే 11 వ్యాగన్లు పడిపోయాయి. రాఘవపూర్ కన్నాల గేటు మధ్యలో గూడ్స్ రైలు అదుపు తప్పింది. ఈ ఘటనలో మూడు రైల్వే లైన్లు ధ్వంసమయ్యాయి. పట్టాలు, కరెంటు పోల్స్ విరిగిపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆ మార్గంలో నడిచే 20 రైళ్లను రద్దు (Many Trains Cancelled.) చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ట్రాక్ పునరుద్ధరణ జరిగిన తర్వాతే రైళ్లను పునరుద్ధరించే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

రద్దు చేసిన రైళ్లు ఇవే..

యశ్వంతపూర్- ముజఫర్పూర్, కాచిగూడ - నాగర్సోల్, కాచిగూడ - కరీంనగర్, కరీంనగర్- కాచిగూడ, సికింద్రాబాద్ - రామేశ్వరం, రామేశ్వరం - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్, అదిలాబాద్ - పార్లీ, పార్లీ - అదిలాబాద్, అకోల - పూర్ణ, పూర్ణ - అకోలా, అదిలాబాద్ - నాందేడ్, నాందేడ్ - అదిలాబాద్, నిజామాబాద్ - కాచిగూడ, కాచిగూడ - రాయచూర్, రాయచూర్ - కాచిగూడ, గుంతకల్ - బోధన్, బోధన్ - కాచిగూడ, కాచిగూడ - గుంతకల్ తదితర రైళ్లను అధికారులు రద్దు చేశారు.


రైల్వే ట్రాక్‌ పునరుద్దరణ పనులు...

అధికారులు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. 24 గంటల సమయం పడుతుందని తెలిపారు. గూడ్స్‌ పట్టాలు తప్పిన విషయం తెలియడంతోనే రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం వల్ల ఈ మార్గంలో ఉన్న మూడు ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. ఖాజీపేట-బల్లార్షా మార్గంలో పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. చెన్నై- ఢిల్లీ ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పెద్దపల్లి స్టేషన్‌లో సంపర్క్ క్రాంతి, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా..

కాగా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. మూడు రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయని చెప్పారు. దీంతో పెద్దపల్లి.. రామగుండం వైపు వెళ్లే రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. తక్షణమే రైల్వే ట్రాక్‌ను పునరుద్దరించాలని అధికారులను బండి సంజయ్ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్ధినిపై వైఎస్సార్సీపీ సర్పంచ్ అత్యాచార యత్నం

అసెంబ్లీలో మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్

స్నేహం నటించి.. చంపేస్తాడు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 13 , 2024 | 09:11 AM