Gangula Kamalakar: కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడుతాం
ABN , Publish Date - Jan 21 , 2024 | 06:08 PM
కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) అన్నారు. బీఆర్ఎస్కు ఇతర పార్టీలతో పనిలేదని.. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తమదని చెప్పారు.
కరీంనగర్: కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్కు ఇతర పార్టీలతో పనిలేదని.. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తమదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. పంట చివరి దశకు వచ్చినా సాగు నీరు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతు బంధు కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజల తరఫున హామీల అమలు కోసం కొట్లాడుదామని తెలిపారు. స్మార్ట్ ప్రకటించినప్పుడు బీజేపీ నేత బండి సంజయ్ ఎంపీ కాదన్నారు. గోడ మీద కూసున్న వారితో ఎప్పుడు ప్రమాదమేనని హెచ్చరించారు. ఎన్నికలప్పుడు ఎవరు డబ్బులిస్తే అటు వైపు వారు దూకుతారని గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు.