Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ.. ఎవరికంటే?
ABN , Publish Date - Jul 16 , 2024 | 05:53 PM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)కు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బహిరంగ లేఖ రాశారు. కేంద్ర క్యాబినేట్‌లో స్థానం దక్కించుకున్నందుకు ముందుగా బండి సంజయ్‌కు పొన్నం శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని లేఖలో కోరారు.
కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)కు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) బహిరంగ లేఖ రాశారు. కేంద్ర క్యాబినేట్‌లో స్థానం దక్కించుకున్నందుకు ముందుగా బండి సంజయ్‌కు పొన్నం శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని లేఖలో కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చడంలో బండి సంజయ్ చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
CM Revanth Reddy: అటవీ సంపదపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
మంత్రి పొన్నం లేఖలో కోరిన అంశాలు..
కేంద్ర ప్రభుత్వం ద్వారా కరీంనగర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, మిడ్ మానేరు, గౌరవెల్లి ప్రాజెక్టుల భూనిర్వాసితులకు సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించి బాధిత కుటుంబాలకు ఆదుకోవాలని బండి సంజయ్‌ను కోరారు. శాతవాహన విశ్వవిద్యాలయానికి రూ.200కోట్ల ఆర్థిక సహాయం అందించాలని, కరీంనగర్- తిరుపతి మధ్య వీక్లి రైలు ప్రతి రోజూ నడిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్- షిర్డీ మధ్య రైల్వే మార్గం డబ్లింగ్‌ను వేగవంతం చేయాలని, కొత్తపల్లి నుంచి జనగాంకు జాతీయ రహదారి మంజూరు అయ్యేలా కేంద్ర పెద్దలతో మాట్లాడాలన్నారు. హుస్నాబాద్‌లో మెడికల్ కాలేజీ, సిరిసిల్ల టెక్స్ టైల్ పార్కు అభివృద్ధికి నిధులు తేవాలన్నారు. వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యేలా చేయాలని కోరారు. NLM, PMEG, NHM పథకాల కింద తగినంత బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించేలా బండి సంజయ్ చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖలో కోరారు.
ఇవి కూడా చదవండి:
Kodanda Reddy: బీఆర్ఎస్ పాఠాలు నేర్పాలని చూస్తోంది: కాంగ్రెస్ నేత కోదండరెడ్డి
Adi Srinivas: బెదిరించి చేర్చుకుంటే ఆధారాలు చూపెట్టండి: ప్రభుత్వ విప్ శ్రీనివాస్
TG News: విద్యార్థిని మృతిపై దిగ్భ్రాంతి..