Share News

Ponnam Prabhakar: బండి సంజయ్ కౌంటర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్...

ABN , Publish Date - Jan 18 , 2024 | 01:25 PM

హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్‌పై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. అలాగే సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాసారు. దీనిపై మంత్రి ట్వీట్...

Ponnam Prabhakar: బండి సంజయ్ కౌంటర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్...

హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్‌పై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. అలాగే సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాసారు. దీనిపై మంత్రి ట్వీట్... ‘‘మీ మొసలి కన్నీరు ఆపి.. ముందు మీ బాధ్యత నెరవెర్చి చేనేత కార్మికుల భారాన్ని తగ్గించాలి.. చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీని కేంద్రంతో రద్దు చేయించాలి.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన చేనేత బోర్డును పునరుద్ధరించాలి.. చేనేత కార్మికుల భీమాను, రాయితీలను తిరిగి ప్రారంభించాలి.. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.. మల్లా ఆడలేక పాత గజ్జెలు అంటే ఎలా?.. ఎవరి సలహాలు.. అవసరం లేకుండా.. నరులకు నాగరికత నేర్పిన చేనేతను ఆదుకుని తీరుతాం’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

బండి సంజయ్ కౌంటర్..

అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అనడం మంచి పద్దతి కాదని, అక్షింతలు అంటే ఎమిటో మీ కుటుంబ సభ్యులను అడగాలని, వాటి ప్రాముఖ్యత గురించి తెలియకుండా మాట్లాడవద్దన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్టని రాజకీయం చేయొద్దన్నారు. అక్షింతలను రేషన్ బియ్యం అనే వారికి వాటి ప్రాముఖ్యత, పవిత్రత తెలియదన్నారు. అక్షింతల గురించి కామెంట్లు చేస్తే వారి ఇంట్లో వాళ్ళు అక్షింతలు వేస్తారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 18 , 2024 | 01:47 PM