Share News

Graduate Mlc: ఎమ్మెల్సీ బరిలో పది మంది అభ్యర్థులు

ABN , Publish Date - Oct 22 , 2024 | 09:54 PM

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికలో పది మంది వరకు అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. వారంతా కొత్త పట్టభద్రుల ఓట్లను నమోదు చేసే పనిలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు.

Graduate Mlc: ఎమ్మెల్సీ బరిలో పది మంది అభ్యర్థులు
Prasanna HariKrishna

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. గత నెల 30వ తేదీన ప్రారంభమైన ప్రక్రియ వచ్చే నెల (నవంబర్) 6వ తేదీన ముగియనుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికలపై కొందరు ప్రముఖులు దృష్టిసారించారు. ఇప్పటి నుంచే పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ప్రెస్ క్లబ్‌లో గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తోన్న అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి వివరించారు.


20 లక్షల మంది పట్టభద్రులు

ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో 20 లక్షల మంది పట్టభద్రులు ఉన్నారు. వీరిలో 50 శాతం ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యెయేట్ స్థానం బరిలో 10 మంది వరకు ఉన్నారు. ప్రసన్న హరికృష్ణతోపాటు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీజేపీ నేత సుగుణాకర్ రావు, ట్రస్మా ప్రతినిథి యాదగిరి శేఖర్ రావు, ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ బీఎన్ రావు, డాక్టర్ హరికృష్ణ, పోకల నాగయ్య పేర్లు వినిపిస్తున్నాయి.


మార్నింగ్ వాక్‌తో కలుస్తూ..

బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రసన్న హరికృష్ణ సహా నరేందర్ రెడ్డి, రవీందర్ సింగ్, సుగుణాకర్ రావు, శేఖర్ రావు తదితరులు మార్నింగ్ వాక్‌తో పట్టభద్రులను, ఉద్యోగులను, విద్యాసంస్థల ప్రతినిధులను కలుస్తున్నారు. కొందరు గ్రాడ్యుయేట్లను ఎన్ రోల్ చేయిస్తున్నారు. తమకే ఓటు వేయాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి:

Nara Lokesh: వంగవీటి రాధా నారా లోకేష్ భేటీ..కారణమిదే.

BiggBoss Season 8: గంగవ్వకు గుండెపోటు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 22 , 2024 | 09:54 PM