Kavitha: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలిబీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:57 AM
‘‘కాంగ్రెస్ ఇచ్చిన హమీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి. ఈ హామీని పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.
3న ఇందిరా పార్కు వద్ద భారీ సభ: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్ ఇచ్చిన హమీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి. ఈ హామీని పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. శుక్రవారం రాష్ట్రంలోని 40కి పైగా బీసీ కుల సంఘాల నాయకులతో కవిత సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
బీసీలకు ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 3వ తేదీన ఇందిరా పార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో చేపట్టనున్న జనగణనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. 40 బీసీ సంఘాలతో తాను సమావేశం అయ్యింది ట్రైలర్ మాత్రమేనని, జనవరి 3న సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. బహిరంగ సభకు బీసీలు పెద్ద సంఖ్యలో హజరై తమ ఐక్యత తెలియజేయాలని ఆమె కోరారు.