Share News

Train Accident: దారుణం.. తండ్రిని కాపాడుదామని.. చివరికి..

ABN , Publish Date - Oct 30 , 2024 | 09:19 PM

ఖమ్మం జిల్లా మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు తన కుమార్తె నూకారాపు సరితను ఖమ్మంపాడుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఇటీవల కేశవరావు అనారోగ్యానికి గురయ్యారు.

Train Accident: దారుణం.. తండ్రిని కాపాడుదామని.. చివరికి..

ఖమ్మం: మధిర రైల్వేస్టేషన్ సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీకొని తండ్రి, కుమార్తె మృతి చెందారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లి వస్తూ చివరికి ప్రాణాలే లేకుండా విగతజీవులుగా మారారు. తండ్రి, కుమార్తె మృతితో స్థానికులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.


ఖమ్మం జిల్లా మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు తన కుమార్తె నూకారాపు సరితను ఖమ్మంపాడుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఇటీవల కేశవరావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో తండ్రికి వైద్యం చేయించాలని సరిత నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇవాళ(బుధవారం) ఉదయం ఇద్దరూ కలిసి విజయవాడ వెళ్లారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలులో తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే మధిర రైల్వేస్టేషన్ వద్ద దిగిన తండ్రి, కుమార్తె పట్టాలు దాటే ప్రయత్నం చేశారు. అదే సమయంలో చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి వారిద్దరినీ ఢీకొట్టింది.


రైలు బలంగా ఢీకొట్టడంతో కేశవరావు, సరిత దూరంగా ఎగిరిపడ్డారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు పరుగులు పెట్టారు. విగత జీవులుగా పడి ఉన్న తమ వారిని చూసి గుండెలు పగిలేలా రోదించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో అటు మల్లారం, ఇటు ఖమ్మంపాడు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

Janwada Farm House Case: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్ పాకాల సేట్మెంట్ రికార్డ్..

CM Revanth Reddy: ఇందిరా గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి..

Group-3 Schedule: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవే..

Updated Date - Oct 30 , 2024 | 09:22 PM