TG News: దత్తత పేరుతో హైడ్రామా... మనవడిని అమ్మేసిన నాయనమ్మ
ABN , Publish Date - Aug 14 , 2024 | 10:22 AM
Telangana: ఖమ్మం జిల్లా రఘునాథ పాలెంలో సొంత మనవడినే అమ్మేసింది నాయనమ్మ. మనవడిని దత్తత పేరుతో హై డ్రామాకు తెరతీసింది. ఖమ్మంలో ఓ కార్పొరేటర్ భర్త సహకారంతో హైదారాబాద్‌వాసికి దాదాపు రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టేసింది.
ఖమ్మం, ఆగస్టు 14: తమ పిల్లల కన్నా వాళ్లకు పుట్టిన పిల్లలనే ఎక్కువ ప్రేమ చేస్తుంటారు నానమ్మలు, అమ్మమ్మలు. అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్టుగా మనవడు, మనవరాల్లు అంటే వారికి మక్కువ ఎక్కువ. వారిని ఎంతో గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ నానమ్మ... మనవడు అన్న కనికరం లేకుండా అమ్మకానికి పెట్టేసింది. ఖమ్మం జిల్లాలో (Khammam) ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రఘునాథ పాలెంలో సొంత మనవడినే అమ్మేసింది నాయనమ్మ. మనవడిని దత్తత పేరుతో హై డ్రామాకు తెరతీసింది. ఖమ్మంలో ఓ కార్పొరేటర్ భర్త సహకారంతో హైదారాబాద్‌వాసికి దాదాపు రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టేసింది.
Chandrababu: ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై నేడు చంద్రబాబు సమీక్ష
ప్రేమ వివాహం చేసుకున్న కొడుకు సాయి 2023లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే అప్పటికే సాయికి ఓ కొడుకు ఉన్నాయి. కొడుకు చనిపోయినా మనవడు ఉన్నాడని మురిసిపోకుండా సదరు నాయనమ్మ కొత్త డ్రామాకు తెరతీసింది. ‘‘కొడుకు చనిపోయాడు... నా మనవడుని నువ్వు సాక లేవు అంటూ నాయనమ్మ పందుల నాగమణి దత్తత తీసుకుంది. దత్తత తరువాత 5లక్షలకి చిన్నారిని అమ్మేసిందంటూ కోడలు స్వప్ప పోలీసులను ఆశ్రయించింది.
రఘునాథ పాలెంకి చెందిన పందుల సాయి ఖమ్మం నగరంలో నిజాంపేటకు చెందిన కొమ్మినబోయిన స్వప్న 2021 డిసెంబరులో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే బాబు పుట్టిన నెల రోజులకే 2023 లో సాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ క్రమంలో 42 వ డివిజన్ కార్పోరేటర్ భర్త శేషగిరితో కలిసి అత్త నాగమణి తన కోడలి వద్ద నుంచి బాబును పెంచుకుంటానని తీసుకెళ్లింది. 45 రోజులకే దత్తత పేరుతో బాబును అమ్మకానికి పెట్టింది. అయితే బాబు కోసం స్వప్ప ఎంతాగానో తపించింది. తన బాబును తనకు ఇవ్వమంటూ కార్పొరేటర్ భర్త చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని స్వప్న ఆవేదన వ్యక్తం చేసింది. బాబును ఇవ్వమంటూ బెదరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘‘నా కుమారుడిని నాకు ఇప్పించండి’’ అంటూ సీసీఎస్ పోలీసులను స్వప్న ఆశ్రయించింది. కేసు నమోదు చేసి సీపీఎస్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తును ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి...
ACB: అవినీతిపరుల భరతం పడుతోన్న ఏసీబీ.. పది రోజుల్లోనే
Read Latest Telangana News And Telugu News