Share News

Revanth Reddy: ముగిసిన రేవంత్ విదేశీ పర్యటన.. కాసేపట్లో హైదరాబాద్‌కు టీం..

ABN , Publish Date - Aug 14 , 2024 | 09:08 AM

సీఎం రేవంత్ రెడ్డి టీం విదేశీ పర్యటన పూర్తైంది. కాసేపట్లో రేవంత్ టీం హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఉదయం 10.50 గంటలకు శంషాబాద్ చేరుకోనున్నారు. 10 రోజుల పాటు అమెరికా, సౌత్ కొరియాలో రేవంత్ టీం పర్యటించింది.

Revanth Reddy: ముగిసిన రేవంత్ విదేశీ పర్యటన.. కాసేపట్లో హైదరాబాద్‌కు టీం..

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి టీం విదేశీ పర్యటన పూర్తైంది. కాసేపట్లో రేవంత్ టీం హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఉదయం 10.50 గంటలకు శంషాబాద్ చేరుకోనున్నారు. 10 రోజుల పాటు అమెరికా, సౌత్ కొరియాలో రేవంత్ టీం పర్యటించింది. విదేశీ పర్యటనపై రేవంత్ సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశారని పేర్కొన్నారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా రేవంత్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికేందుకు కేడర్ సిద్ధమైంది. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి. అమెరికా పర్యటనలో 31532 కోట్ల పెట్టుబడులను రేవంత్ రాబట్టింది. 30750 కొత్త ఉద్యోగాల కల్పనకు సీఎం కృషి చేశారు.19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు జరిపారు.


హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు నిర్వహిస్తున్నారు. అమెజాన్, జొయిటిస్, హెచ్‌సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులపై కొరియ‌న్ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి.


రేవంత్ రెడ్డి పిలుపునకు కొరియ‌న్ జౌళి ప‌రిశ్రమ స‌మాఖ్య సానుకూలత వ్యక్తం చేసింది. త్వర‌లో తెలంగాణ‌ను ఎల్ఎస్ కంపెనీ బృందం సంద‌ర్శించ‌నుంది. తెలంగాణ‌లో హెచ్ఎంఐఈ కారు మెగా టెస్ట్ సెంట‌ర్‌‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దక్షిణ కొరియా పర్యటన నుంచి బుధవారం హైదరాబాద్‌ చేరుకోనున్న వీరు.. తర్వాత కాగ్నిజెంట్‌ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు చెందిన మరో క్యాంపస్‌ హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. కోకాపేటలోని బహుళ అంతస్తుల జీఏఆర్‌ టవర్‌లో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు. కొత్త క్యాంపస్‌ ద్వారా 15 వేల కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఉమ్మడి ఏపీలో 2002లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో తొలి కార్యాలయాన్ని కాగ్నిజెంట్‌ ప్రారంభించింది.

Updated Date - Aug 14 , 2024 | 09:08 AM