Share News

Jupalli: పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

ABN , Publish Date - Aug 12 , 2024 | 11:12 AM

Telangana: జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్తూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉదయం సందర్శించారు. అనంతరం బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

Jupalli: పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష
Minister Jupalli Krishna Rao

ఖమ్మం, ఆగస్టు 12: జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్తూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉదయం సందర్శించారు. అనంతరం బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao)సమీక్షా సమావేశం నిర్వహించారు. బౌద్ధ స్తూపాన్ని పర్యాటకులకు అందించేందుకు ఏం చేద్దామని ప్రశ్నించారు. ఎందుకు ఇంత కాలం నిర్లక్ష్యం చేశారని నిలదీశారు. ముఖ్యమైన బౌద్ధ స్థూపంకి పూర్వ వైభవం తీసుకుని రావాలన్నారు. ఎనిమిది ఎకరాలను అభివృద్ధి చేయాలన్నారు. స్థూపంకి లైటింగ్, నీటి లభ్యత, బోటింగ్ ఏర్పాటుకి సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో బౌద్ధ స్థలాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో మూడు స్థలాలో పాలేరు కీలకమైనదన్నారు. సిబ్బంది కొరత, బడ్జెట్ లేదని మంత్రులకు అధికారులు వెల్లడించారు.

KTR: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విసుర్లు



మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే నేలకొండపల్లి బౌద్ధ స్థూపంకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి జరిగిందన్నారు. నేలకొండపల్లి బౌద్ధ స్థూపం అండర్ గ్రౌండ్‌లో ఇంకా స్థూపాలున్నాయన్నారు. టూరిజంలో బెస్ట్ ప్లేస్‌గా నేలకొండపల్లిని తీర్చిదిద్దాలన్నారు. నేలకొండపల్లిలో భక్తరామదాసు నివసించిన ఇల్లుని మ్యూజియంగా మార్చాలన్నారు. పాలేరు నియోజకవర్గంలో రిజర్వాయర్ అభివృద్ది చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


వాటిని ప్రపంచపటంలో ఉంచాలి: భట్టి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలను ప్రపంచ పటంలో ఉంచాలని.. ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి బుద్దిస్ట్‌లను ఇక్కడికి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏరకంగా తీసుకురావలో చూడటానికి వచ్చారన్నారు. బుద్దిస్ట్‌లను కార్యక్రమం ఏర్పాటు చేసి ఇన్వైట్ చేయాలని... వారి సూచనలు తీసుకుని టూరిజం అభివృద్ధి చేయాలని ఆలోచలనో ఉన్నామన్నారు. నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్కియాలజికల్ సైట్‌గా చేయాలన్నారు. వసతులు, ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. టూరిజం, ఆర్కియాలజీ ఇద్దరు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. బుద్దిస్ట్‌లకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Sachin's Aunt Anabel Mehta: కాబోయే అల్లుడు ఆరడుగులు ఉంటాడనుకున్నా!

Rain Update: హైదరాబాద్‌లో కుండపోత వర్షం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 12 , 2024 | 12:02 PM