Minister Tummala: ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి జాప్యం జరగవద్దు
ABN , Publish Date - Jan 18 , 2024 | 10:12 PM
ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి జాప్యం జరగవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Tummala Nageswara Rao ) తెలిపారు.
ఖమ్మం: ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి జాప్యం జరగవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Tummala Nageswara Rao ) తెలిపారు. గురువారం యాసంగిలో ఎరువుల లభ్యతపై మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... నోడల్ ఏజెన్సీలు, ఎరువుల కంపెనీలతో చర్చించి అన్ని రకాల ఎరువులను గ్రామాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. మార్క్ ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎరువుల అవసరాలను గుర్తించి దశల వారీగా రైతులకు అందించాలన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 22 శాతం అధికంగా ఎరువులు నిల్వ ఉన్నాయని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది యూరియా 33శాతం అధికంగా నిల్వ ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఆ రుణాలు తీర్చని వారిపై కఠిన చర్యలు: తుమ్మల నాగేశ్వరరావు
మొండి బకాయిలు, నాన్ అగ్రికల్చర్ రుణాలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. DCCB అండ్ PACSలో పాత రుణాల బకాయిలపై మంత్రి తుమ్మల గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫాక్స్ లో నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న రుణాలను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని TSCABను ఆదేశించారు. ఫాక్స్ సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు. రుణాలు తీర్చని, వాటిని రికవరీ చేయని అధికారులపై చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.