Share News

Kishan Reddy: మీడియా స్వేచ్ఛపై రాహుల్‌ దుష్ప్రచారం

ABN , Publish Date - Sep 15 , 2024 | 03:31 AM

దేశంలోని మీడియా స్వేచ్ఛపై రాహుల్‌ గాంధీ విదేశాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Kishan Reddy: మీడియా స్వేచ్ఛపై రాహుల్‌ దుష్ప్రచారం

  • విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించే కుట్ర

  • జర్నలిస్టుపై దాడి.. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యమా..?

  • రాజ్యాంగంపై రాహుల్‌ కపట ప్రేమ: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/అడ్డగుట్ట, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): దేశంలోని మీడియా స్వేచ్ఛపై రాహుల్‌ గాంధీ విదేశాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. విదేశీ గడ్డపై దేశ ప్రజాస్వామ్య విలువలను దిగజార్చేలా, రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమెరికాలో మన దేశానికి చెందిన సీనియర్‌ జర్నలిస్టుపై దాడితో రాహుల్‌ గాంధీ నిజ స్వరూపం తెలిసిందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన హత్యాకాండపై కాంగ్రెస్‌ తన వైఖరిని అంగీకరించిందని తెలిపారు. జర్నలిస్టు ప్రశ్నిేస్త సమాధానం చెప్పలేక అతనిపై దాడి చేయమేనా కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యం..? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతూ రాహుల్‌ గాంధీ రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై కపటప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.


దేశం పరువు తీయాలనే ఏకైక లక్ష్యంతోనే విదేశీ పర్యటనలు చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ సమయంలో పత్రికా స్వేచ్ఛ గొంతు నులిమి, అనేక పత్రికలను నిషేధించి, ఎడిటర్లను, విలేకరులను జైల్లో పెట్టించిన విషయాన్ని కిషన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో గుర్తు చేశారు. కాగా, రాష్ట్రంలోని దాదాపు 35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పిలిచిన టెండర్లలో రూ.750 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ శాసనసభా పక్ష ఉప నేత పాయల్‌ శంకర్‌ ఆరోపించారు. పాలకుల అనుయాయులకు మాత్రమే టెండర్‌ దక్కేలా చేశారని విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్‌ చేశారు. మజ్లిస్‌ మొప్పు కోసమే సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు దూరంగా ఉన్నారని ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. ఈ నెల 17న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో నిర్వహించే విమోచన ఉత్సవ ఏర్పాట్లను శనివారం లక్ష్మణ్‌ పరిశీలించారు.

Updated Date - Sep 15 , 2024 | 03:31 AM