Kishan Reddy: అబద్ధాలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
ABN , Publish Date - Mar 17 , 2024 | 06:49 PM
అబద్ధాలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ వెబ్ సైట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... పోరాటాలతో వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బలి అయ్యిందన్నారు. పదేళ్లలో తెలంగాణ ఇబ్బందులకు గురైందని చెప్పారు.
హైదరాబాద్: అబద్ధాలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ వెబ్ సైట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... పోరాటాలతో వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బలి అయ్యిందన్నారు. పదేళ్లలో తెలంగాణ ఇబ్బందులకు గురైందని చెప్పారు. ధర్నా చౌక్‌ను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాన్ చేసిందని మండిపడ్డారు. అనేక కారణాలతో కేసీఆర్ ఓడిపోయారు కాని తెలంగాణ గెలవలేదని చెప్పారు. కాంగ్రెస్ డిక్లరేషన్‌ల పేరుతో ప్రకటనలు చేయించారని చెప్పారు.కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలకు అమలు చేయడం లేదన్నారు. మహిళల కు నెలకు రూ. 2500 పథకం, రైతు భరోసా రూ.2లక్షల రుణమాఫీ హామీ ఏమైందని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12వేల రూపాయలపై వరిపంటకు బోనస్ పైనా స్పష్టత లేకుండా పోయిందని చెప్పారు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు విషయం మరచిపోయినట్టు కనిపిస్తుందని అన్నారు.
పాల ఉత్పత్తి దారులకు లీటరుకు రూ.5 బోనస్ అమలు చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ఇస్తామన్న రూ. 4వేల నిరుద్యోగ భృతి గారడిగానే మారిందన్నారు. అమ్మాయిలకు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వలేదన్నారు. మహిళలకు పదిలక్షల వడ్డీ లేని రుణాల హామీను ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని... అసలు ఇస్తారా ఇవ్వరో చెప్పాలని నిలదీశారు. 57ఏళ్లు నిండిన వారికీ ఇస్తానన్న రూ.4వేల చేయూత ఏమైందని ప్రశ్నించారు. హామీలను ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని విరుచుకుపడ్డారు. ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో నేటి నుంచి క్యాంపైయిన్ ప్రారంభించామని తెలిపారు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే వరకు ఈ ప్రభుత్వంను వెంటాడుతామని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి