Share News

Kishan Reddy: ప్రైవేటు భాగస్వామ్యంతో సుస్థిర ప్రగతి..

ABN , Publish Date - Jul 01 , 2024 | 03:12 AM

ప్రైవేటు భాగస్వామ్యం, సాంకేతిక పురోగతి ద్వారా సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఉద్యోగాల కల్పన, ఎగుమతులు పెంచడం, ప్రపంచంతో మన దేశం పోటీపడటానికి ప్రైవేటు పెట్టుబడులు, వినూత్న ఆలోచనలు కీలకమైనవని పేర్కొన్నారు.

Kishan Reddy: ప్రైవేటు భాగస్వామ్యంతో సుస్థిర ప్రగతి..

  • నిర్మాణాత్మక చర్చలతోనే దేశ భవిత

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • తాజ్‌కృష్ణలో వ్యాపారవేత్తల సదస్సు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు భాగస్వామ్యం, సాంకేతిక పురోగతి ద్వారా సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఉద్యోగాల కల్పన, ఎగుమతులు పెంచడం, ప్రపంచంతో మన దేశం పోటీపడటానికి ప్రైవేటు పెట్టుబడులు, వినూత్న ఆలోచనలు కీలకమైనవని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ప్రైవేటు రంగానికి అండగా ఉందని చెప్పారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో వ్యాపారవేత్తల ఆత్మీయ సదస్సు ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు.


‘‘ప్రభుత్వానికి, పారిశ్రామికవేత్తలకు మధ్య నిర్మాణాత్మకమైన చర్చకు ఈ వేదిక చాలా కీలకమైంది. ఇలాంటి చర్చల ద్వారానే దేశ భవిష్యత్తుకు బాటలు పడతాయి. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపే క్రమంలో.. మనకు ఎదురయ్యే సవాళ్ల గురించి కార్పొరేట్‌ కంపెనీలతో చర్చించేందుకు, వినూత్న ఆలోచనలు పంచుకోవడానికి ఇది మంచి వేదిక. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, సాంకేతికతకు హైదరాబాద్‌ కేంద్ర బిందువుగా ఉంది. దేశాన్ని ఆత్మనిర్భర్‌ భారత్‌గా, విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి మన స్టార్ట్‌పలు అద్భుతమైన పురోభివృద్ధిని సాధించాయి’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

Updated Date - Jul 01 , 2024 | 03:12 AM