Kondagattu: కొండగట్టు అంజన్న జయంతి వేడుకలు ప్రారంభం..
ABN , Publish Date - May 31 , 2024 | 04:58 AM
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. అంజన్న జయంతి వేడుకలల్లో భాగంగా భద్రాచలం సీతారాముల దేవస్థానం తరుపున ఈవో రమాదేవి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కళాకారులతో నిర్వహించిన శోభాయాత్రతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది.
హనుమాన్‌కు భద్రాచలం రాములోరి తలంబ్రాలు
మల్యాల, మే 30: కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. అంజన్న జయంతి వేడుకలల్లో భాగంగా భద్రాచలం సీతారాముల దేవస్థానం తరుపున ఈవో రమాదేవి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కళాకారులతో నిర్వహించిన శోభాయాత్రతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. అనంతరం అర్చకులు.. ఆలయంలోని ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు. మూడు రోజుల పాటు యాగశాలలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల మంది దీక్షాపరులు రానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.