KTR: కెమెరాల ముందు హంగామా కాదు.. గురుకులాల బిడ్డల గుండె చప్పుడు వినండి
ABN , Publish Date - Dec 15 , 2024 | 03:51 AM
‘‘బీఆర్‌ఎస్ చేపట్టిన గురుకులాల బాటతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చింది. ఇప్పుడు గురుకులాలకు వెళ్తున్నారు. కెమెరాల ముందు హంగామా కాకుండా గురుకులాల బిడ్డల గుండెచప్పుడు వినండి’’ అని మాజీ మంత్రి కేటీఆర్ శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ అస్థిత్వంపై సర్కారు కుట్ర: కేటీఆర్
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్‌ఎస్ చేపట్టిన గురుకులాల బాటతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చింది. ఇప్పుడు గురుకులాలకు వెళ్తున్నారు. కెమెరాల ముందు హంగామా కాకుండా గురుకులాల బిడ్డల గుండెచప్పుడు వినండి’’ అని మాజీ మంత్రి కేటీఆర్ శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని, సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు రేపారన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో గురుకులాల విద్యార్థులు ఎవరెస్టు వంటి అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తే ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రి ఎక్కించారని ఎద్దేవా చేశారు.
గురుకులాల్లో మొక్కుబడి సందర్శన వద్దని, ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని కోరారు. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో మంత్రి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే అనీల్ జాదవ్‌ను పోలీ్‌సలు అడ్డుకోవడం సరికాదని కేటీఆర్ అన్నారు. ప్రజాపాలనలో ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మరోవైపు శనివారం ప్రముఖ కవి నందిని సిధారెడ్డిని ఆయన ఇంట్లో కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి నగదు పారితోషికం, ప్లాట్‌ను సిధారెడ్డి తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తుందన్నారు.