Share News

Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్‌

ABN , Publish Date - Oct 11 , 2024 | 04:16 AM

వరదలు ముంచెత్తిన నష్టంతో విలవిలలాడిన రైతాంగాన్ని కాంగ్రెస్‌ సర్కారు మరో సారి నిండా ముంచిందని, అది పరిహారం కాదు.. పరిహాసమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : వరదలు ముంచెత్తిన నష్టంతో విలవిలలాడిన రైతాంగాన్ని కాంగ్రెస్‌ సర్కారు మరో సారి నిండా ముంచిందని, అది పరిహారం కాదు.. పరిహాసమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 3.35 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. 79,574 ఎకరాలకు కంటి తుడుపుగా పరిహారమిచ్చి మమ అనిపించడం దారుణమని పేర్కొన్నారు.


రైతులను ఆదుకునే విషయంలో ఉదారంగా వ్యవహరించలేరా? మానవత్వం ప్రదర్శించలేరా? అని నిలదీశారు. 4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. 5.20లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందంటూ కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చింది నిజం కాదా? అని నిలదీశారు. ఇప్పుడు ఇంత భారీ కోతలతో పంట నష్టం అంచనాలను ఎందుకు తలకిందులు చేశారో..సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 11 , 2024 | 04:16 AM