Share News

KTR: రేవంత్ ప్రభుత్వాన్ని మేము కూల్చం.. కేటీఆర్ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Mar 07 , 2024 | 06:26 PM

రేవంత్ ప్రభుత్వాన్ని తాము కూల్చమని.. తమ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం లేదని.. ఐదేళ్లు ఆయనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. రేవంత్‌ను కాంగ్రెస్ నేతలే సీఎం పదవి నుంచి దించేస్తారని చెప్పారు.

KTR: రేవంత్  ప్రభుత్వాన్ని మేము కూల్చం.. కేటీఆర్ హాట్ కామెంట్స్
KTR

కరీంనగర్: రేవంత్ ప్రభుత్వాన్ని తాము కూల్చమని.. తమ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం లేదని.. ఐదేళ్లు ఆయనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. రేవంత్‌ను కాంగ్రెస్ నేతలే సీఎం పదవి నుంచి దించేస్తారని చెప్పారు. గురువారం నాడు కరీంగనర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.... మాజీ సీఎం కేసీఆర్‌కు కరీంనగర్ సెంటిమెంట్ అని అందుకనే ఇక్కడ సభ పెట్టాలని నిర్ణయించారని తెలిపారు. అబద్ధాల రేవంత్ మీద జంగ్ సైరన్ మోగించడానికి కేసీఆర్ వస్తున్నారని చెప్పారు.

రేవంత్ బాషా ప్రయోగం అర్ధం కావడం లేదన్నారు. అధికారంలో ఉండి రేవంత్‌కు అంత ఫ్రస్టేషన్ ఎందుకోనని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ ఇలాంటి మాటలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 420 హామీలు నెరవేర్చక పోతే వెంటపడుతామని హెచ్చరించారు. ఈ ముఖ్యమంత్రికి రైతుబంధు ఇచ్చే తెలివి లేదని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మగా మారడం గ్యారంటీ అని చెప్పారు. కాంగ్రెస్‌ని రేవంత్ వీడటం ఖాయమని కేటీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి

CM Revanth: మేము అధికారంలోకి రాగానే ఆ సమస్యను పరిష్కరించాం

Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 06:39 PM