Share News

KTR, Harish Rao: సాయిచంద్‌ కుటుంబానికి అండగా ఉంటాం..

ABN , Publish Date - Jun 30 , 2024 | 09:47 AM

తెలంగాణ ఉద్యమ గాయకుడు, వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ దివంగత చైర్మన్‌ సాయిచంద్‌(Saichand) కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు(Former Ministers KTR, Harish Rao) అన్నారు.

KTR, Harish Rao: సాయిచంద్‌ కుటుంబానికి అండగా ఉంటాం..

- వర్ధంతి సభలో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ దివంగత చైర్మన్‌ సాయిచంద్‌(Saichand) కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు(Former Ministers KTR, Harish Rao) అన్నారు. వనస్థలిపురం డివిజన్‌హస్తినాపురంలోని జీఎస్ఆర్‌ హాల్లో ఏర్పాటు చేసిన సాయిచంద్‌ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, రసమయి బాలకిషన్‌, బాల్క సుమన్‌, గాదరి కిషోర్‌, పట్నం నరేందర్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్‌గౌడ్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, దేశపతి శ్రీనివాస్‌, దూదిమెట్ల బాలరాజ్‌, దేవిశ్రీప్రసాద్‌ తదితరులు హాజరై సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 111 మండలాల్లో లోటు వర్షపాతమే..


city1.2.jpg

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌కు సాయిచంద్‌ కుడి భుజం మాదిరిగా ఉండి తెలంగాణ కోసం తన ఆట పాటలతో చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. హరీశ్‌ రావు మాట్లాడుతూ సాయిచంద్‌ లేకుండా కేసీఆర్‌ సభ లేదని, తెలంగాణ ఏర్పాటులో సాయిచంద్‌ కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు. అనంతరం కళాకారులు డప్పు రవి, రాజీవ్‌ రూపొందించిన సాయిచంద్‌ స్మృతి గీతాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రజినీసాయిచంద్‌, సాయిచంద్‌ తండ్రి వెంకటరాములు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 09:47 AM