Share News

KTR: తీహార్ జైల్లో కవితతో కేటీఆర్ ములాఖత్..

ABN , Publish Date - Jun 14 , 2024 | 12:41 PM

తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కవిత యోగ క్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

KTR: తీహార్ జైల్లో కవితతో కేటీఆర్ ములాఖత్..

ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కవిత యోగ క్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. కవితను బయటకు తీసుకురావడం కోసం ఆమె కుటుంబం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఆ ప్రయత్నాలన్నింటికీ దర్యాప్తు సంస్థలు బ్రేకులు వేస్తూనే ఉన్నాయి. ఎప్పుడు బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కూడా దర్యాప్తు సంస్థలు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకు వస్తున్నారు. దీంతో బెయిల్ వాయిదా పడుతూనే ఉంది.

Updated Date - Jun 14 , 2024 | 12:41 PM