KTR: 48 గంటల్లో ఆ సమస్యను పరిష్కరించండి.. లేదంటే..
ABN , Publish Date - Jul 17 , 2024 | 11:05 AM
స్థానిక సమస్యలపై పౌరులు ఫిర్యాదు చేసినా జీహెచ్‌ఎంసీ పట్టించుకోకపోవడంపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో సమస్యలపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు.
- శ్రమదానం చేస్తాం
- నెటిజన్ పోస్ట్‌పై కేటీఆర్
హైదరాబాద్ సిటీ: స్థానిక సమస్యలపై పౌరులు ఫిర్యాదు చేసినా జీహెచ్‌ఎంసీ పట్టించుకోకపోవడంపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో సమస్యలపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. సమస్యలను పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కోరుతూ.. 48 గంటల్లో పరిష్కరించని పక్షంలో స్థానికులతో కలిసి తామే శ్రమదానం చేస్తామని పేర్కొన్నారు. ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు.
ఇదికూడా చదవండి: TG News: రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. మహిళను ఈడ్చుకుంటూ వెళ్లి మరీ..
కాలనీలో భారీగా చెట్లు పెరగడం.. చెత్తా చెదారం పేరుకుపోవడం వల్ల పాముల బెడద ఉందని, మేయర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 50 కుటుంబాలున్న కాలనీలో రోడ్లు, తాగునీటి సౌకర్యం లేదని, దొంగతనాలూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం ఫిరాయింపులపై పెట్టిన దృష్టిని ప్రజాసమస్యల పరిష్కారంలో చూపడం లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News