TS News: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు మృతి
ABN , Publish Date - Jan 05 , 2024 | 07:47 PM
జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ చౌరస్తాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ చౌరస్తాలో ఆగి ఉన్న ఆటోను డీసీఎం ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు. బాలానగర్ పక్కనున్న తండాల నుంచి గిరిజనులు మండల కేంద్రమైన బాలనగర్‌లో జరిగే వారాంతపు సంతకు వచ్చారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మహబూబ్‌నగర్: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ చౌరస్తాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ చౌరస్తాలో ఆగి ఉన్న ఆటోను డీసీఎం ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి, వారి పరిస్థితి విషమంగా ఉంది. బాలానగర్ పక్కనున్న తండాల నుంచి గిరిజనులు మండల కేంద్రమైన బాలనగర్‌లో జరిగే వారాంతపు సంతకు వచ్చారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు బాలానగర్ మండలంలోని మేడిగడ్డా తండా, నందారం, బీబీనగర్ తండా వాసులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాద ఘటనతో 44వ జాతీయ రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. మృతుల బంధువులు.. బాలనగర్ వాసులు 44 నెంబర్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనాన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. ఘటన స్థలానికి వచ్చిన జడ్చర్ల రూరల్ సీఐ, బాలానగర్ ఎస్‌ఐను ఆందోళనకారులు షాపులో నిర్బంధించారు. సంత నాడు ట్రాఫిక్ నిర్వహణ సరిగా చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.బాలానగర్ చౌరస్తాకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేంది లేదని మృతుల బంధువులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనను కొనసాగిస్తున్నారు.