Share News

Mallareddy Land Issue: మా భూమినే కబ్జా చేస్తారా? అల్లుడితో వచ్చి రచ్చ చేసిన మల్లారెడ్డి..

ABN , Publish Date - May 18 , 2024 | 12:13 PM

మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

Mallareddy Land Issue: మా భూమినే కబ్జా చేస్తారా? అల్లుడితో వచ్చి రచ్చ చేసిన మల్లారెడ్డి..

మేడ్చల్: మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులతో కూడా మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు వాగ్వాదానికి దిగారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 లో ఉన్న రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదనకు దిగారు.

Serial Actor Chandu Wife: పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ మమ్మల్ని వదిలేశాడు


ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేయాలని సదరు 15 మంది వ్యక్తులు చెబుతున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు అంటున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున ఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకూ పోలీసులు సర్డి చెబుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని సదరు 15 మంది వ్యక్తులు చెబుతున్నారు. పోలీసులు ఇంకా ఘటనా స్థలంలోనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

Jagan : లగ్జరీ ఫ్లైట్‌లో పేదింటి బిడ్డ!

వైసీపీ పోలీసింగ్‌పై కొరడా!

Read more Telagana News and Telugu News

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - May 18 , 2024 | 12:43 PM

News Hub