TG Politics: చిల్లర రాజకీయాలు మానుకో.. మైనంపల్లికి మల్లారెడ్డి కొడుకు స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Mar 18 , 2024 | 07:51 PM
70వేల మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చి దిద్దుతున్నామని మల్లారెడ్డి యునివర్సిటీ డెరైక్టర్ భద్ర రెడ్డి(Bhadra Reddy) అన్నారు. కళాశాల లోపలికి వచ్చి, రౌడీయిజం చేసి విద్యార్థుల జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.
కుత్బుల్లాపూర్: 70వేల మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చి దిద్దుతున్నామని మల్లారెడ్డి యునివర్సిటీ డెరైక్టర్ భద్ర రెడ్డి (Bhadra Reddy) అన్నారు. కళాశాల లోపలికి వచ్చి, రౌడీయిజం చేసి విద్యార్థుల జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. అగ్రికల్చర్ కోర్సులు చేసే విద్యార్థుల తరుపున ఉదయం మైనంపల్లి హనుమంత్ రావు యునివర్సిటీ లోపలకి రావడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి యునివర్సిటీ డైరెక్టర్స్ మల్లారెడ్డి కొడుకు భద్రా రెడ్డి, మరియు కోడలు ప్రీతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం అనేది బైట చేయాలని, పిల్లలు చదువుకునే కాలేజీలో కాదని చెప్పారు. కళాశాల లోపలికి మరోసారి వచ్చే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. గత పదేళ్లుగా రాని ఇబ్బందులు, రెండు నెలలుగా ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. తమను రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి దాడులకు పాల్పదుతున్నారని విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దని అన్నారు. తమ దగ్గర తప్పు ఉంటే చట్టపరంగా చర్యలకు సిద్ధమని చెప్పారు. అంతేగానీ మైనంపల్లి చిల్లర రాజకీయాలు మానుకోవాలని భద్ర రెడ్డి హెచ్చరించారు.
కాగా... మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో (Mallareddy Agriculture University) విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ హిస్తున్నారని స్టూడెంట్స్ (Students) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బీఎస్సీ అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన విద్యార్థులు... మల్లారెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు మైనం పల్లి హనుమంత్ రావు కాలేజ్‌కు వచ్చారు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడుతున్న ఆయన.. పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి