Mallu Ravi: TG కోడ్‌పై కేంద్రం గెజిట్ విడుదల చేయడానికి కారణమిదే..
ABN , Publish Date - Mar 15 , 2024 | 08:56 PM
TG కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ కోసం గెజిట్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కేంద్రానికి లేఖ రాయడంతో TG కోడ్‌ని అమల్లోకి తీసుకు వచ్చిందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) తెలిపారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై గతంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చర్చించారని తెలిపారు.
ఢిల్లీ: TG కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ కోసం గెజిట్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కేంద్రానికి లేఖ రాయడంతో TG కోడ్‌ని అమల్లోకి తీసుకు వచ్చిందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) తెలిపారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై గతంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చర్చించారని తెలిపారు.
గతంలో తెలంగాణ ఉద్యమంలో వాహనాలకు TG రిజిస్ట్రేషన్ ఉండాలని అందరూ భావించారని.. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక తన స్వార్థం కోసం TS కోడ్‌ని అమల్లోకి తీసుకొచ్చారని అన్నారు. గతంలో కూడా నాగర్ కర్నూల్ నుంచి తాను పోటీ చేసి గెలుపొందానని అన్నారు. నాగర్ కర్నూల్‌లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు. లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా హై కమాండ్‌కు లేఖ ఇచ్చారని మల్లు రవి చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి