Manchu Manoj: నేనే తీసుకెళ్లా.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 14 , 2024 | 01:24 PM
Manchu Manoj: మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ రోజుకో కొత్త టర్న్ తీసుకుంటోంది. తాజాగా ఈ వివాదంపై మంచు మనోజ్ స్పందించారు. తానే తీసుకెళ్లానంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ రోజుకో కొత్త టర్న్ తీసుకుంటోంది. ఒక మీడియా సంస్థ జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనలో ఆ జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడటంతో మోహన్ బాబు సారీ చెప్పాలంటూ జర్నలిస్ట్ సంఘాలు ధర్నాకు దిగాయి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. తాజాగా ఈ కాంట్రవర్సీ మీద మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. తానే తీసుకెళ్లానంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేనే తీసుకెళ్లా
జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో మీడియా తప్పేమీ లేదన్నారు మంచు మనోజ్. తానే వారిని లోపలకు తీసుకెళ్లానని స్పష్టం చేశారు. ‘ఈ ఘటనలో మీడియా తప్పేమీ లేదు. నిస్సహాయ స్థితిలో నేనే జర్నలిస్టులను లోపలకు తీసుకొని వెళ్లా. మా ఇంట్లోకి నన్ను రానివ్వకపోవడంతోనే మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకొని వెళ్లా. లోపలికి వెళ్లిన తర్వాత జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. ఇందులో మీడియా తప్పు లేదు’ అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.
షూటింగ్‌కు హాజరు
కుటుంబ గొడవలతో సతమతమవుతున్న తరుణంలో మనోజ్ ఒక మూవీ షూటింగ్లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ‘భైరవం’ అనే సినిమా చిత్రీకరణకు ఆయన హాజరయ్యారని సమాచారం. ఇందులో మనోజ్‌తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. దివ్య పిళ్లై, ఆనంది, అదితి శంకర్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్‌కు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read:
నేనెక్కడికీ పోలేదు.. మా ఇంట్లోనే ఉన్నా: మోహన్ బాబు
అల్లు అర్జున్ ఇంటికి సురేఖ
అల్లు అర్జున్ విడుదల.. కానీ ఇంటికి వెళ్లలేదు
For More Telangana And Telugu News