Share News

TG News: ఇన్‌స్టా గ్రామ్‌ పరిచయమే శాపంగా మారి ఆ యువతిని...

ABN , Publish Date - Aug 10 , 2024 | 02:06 PM

Telangana: సోషల్ మీడియాను యువత ఎంతగా ఉపయోగించుకుంటున్నారో తెలిసిందే. అయితే సోషల్ మీడియా ద్వారా అనేక మంది ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతులు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్ ఇలా పలు మాధ్యమాల్లో ముఖపరిచయం లేని వ్యక్తులతో యువతులు మాట్లాడుతుంటారు.

TG News: ఇన్‌స్టా గ్రామ్‌ పరిచయమే శాపంగా మారి ఆ యువతిని...
BPharmacy student commits suicide

హైదరాబాద్, ఆగస్టు 10: సోషల్ మీడియాను యువత ఎంతగా ఉపయోగించుకుంటున్నారో తెలిసిందే. అయితే సోషల్ మీడియా ద్వారా అనేక మంది ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతులు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్ ఇలా పలు మాధ్యమాల్లో ముఖపరిచయం లేని వ్యక్తులతో యువతులు మాట్లాడుతుంటారు. ఇవి ఒక్కోసారి చెడుకి కూడా దారి తీస్తుంటాయి. కొందరు యువకులు తమ పేరును మార్చి యువతులను ఏమార్చుతుంటారు.

CM Revanth: హైదరాబాద్‌లో జోయిటిస్ విస్తరణ


మరికొందరైతే యువతులతో స్నేహం పెంచుకోవడమే కాకుండా ప్రేమ అంటూ వెంటబడుతుంటారు. అప్పటి వరకు స్నేహంతో మంచిగా వ్యవహరించిన వారు ఒక్కసారిగా లవ్ అంటూ విసుగెత్తిస్తుంటారు. యువతి ఒప్పుకుంటే సరే.. లేదంటే ఆ యువతిని తీవ్ర వేధింపులకు గురిచేస్తుంటారు. వేధింపులు శృతి మించడంతో కొందరు యువతులు ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని ప్రేమ వేధింపులను తాళలేక బలవన్మరణానికి పాల్పడింది.

Chandrababu: తెలంగాణపై ఫోకస్.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం


సంగారెడ్డి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇన్ స్టా గ్రామ్‌లో పరిచయమైన యువకుడి వేధింపులతో యువతి ప్రాణాలు తీసుకుంది. బీ.ఫార్మసీ చదువుతున్న విద్యార్థి తేజస్విని గుమ్మడిదల మండలం దోమడుగులో నాలుగో అంతస్తు నుంచి దూకి బలన్మరణానికి పాల్పడింది. ఇన్ స్టాలో పరిచయమై ప్రేమ పేరుతో శ్రీహరి వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం రెండు కుటుంబాలకు మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్థాపం చెందిన యువతి భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. అయితే యువతి కారణమైన శ్రీహరి భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీహరిని చికిత్స నిమిత్తం సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

TG Police: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ పోలీస్‌శాఖ అలర్ట్

BSNL: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 10 , 2024 | 02:06 PM