Earthquake: తెలంగాణలో స్వల్ప భూకంపం.. ఎక్కడంటే..?
ABN , Publish Date - Jan 27 , 2024 | 07:26 PM
జిల్లాలో స్వల్ప భూకంపం(Earthquake) సంబవించింది. న్యాల్ కల్ మండలంలో భూకంపానికి గురయింది. న్యాల్‌కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కనిపించింది.
సంగారెడ్డి: జిల్లాలో స్వల్ప భూకంపం(Earthquake) సంబవించింది. న్యాల్ కల్ మండలం భూకంపానికి గురయింది. మండలంలోని న్యాల్‌కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. సుమారుగా సాయంత్రం 4.30 సమయంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ప్రకంపనాలతో ఇళ్ల నుంచి జనాలు బయటికి పరుగులు తీశారు. శబ్దంతో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
భూకంపం ధాటికి వస్తువులు కిందపడినట్లు ప్రజలు చెబుతున్నారు. భూమిలో నుంచి వింత శబ్దాలు వచ్చినట్లు పేర్కొంటున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్తులు వెల్లడించారు. భూ ప్రకంపనాలపై ఆయా గ్రామాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.