Share News

Raghunandan Rao: ఎమ్మెల్యేలను చేర్చుకునే శ్రద్ధ నిరుద్యోగులపై పెట్టాలి: ఎంపీ రఘునందన్ రావు..

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:23 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతూ కాంగ్రెస్‌లో చేర్చుకోవడం దారుణమంటూ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉంటూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

Raghunandan Rao: ఎమ్మెల్యేలను చేర్చుకునే శ్రద్ధ నిరుద్యోగులపై పెట్టాలి: ఎంపీ రఘునందన్ రావు..
MP Raghunandan Rao

సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతూ కాంగ్రెస్‌లో చేర్చుకోవడం దారుణమంటూ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉంటూ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వేరే పార్టీల ఎమ్మెల్యేలను వెంటాడుతూ పార్టీలో చేర్చుకునే శ్రద్ధ.. విద్యార్థులు, ఉద్యోగ నియామకాలు, రైతు భరోసా పంపిణీపై పెట్టాలని ఎంపీ హితబోధ చేశారు. రాజకీయ చదరంగంలో పడి సీఎం రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో నంబర్-2గా చెప్పుకునే ఓ మంత్రి.. బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చమని చెప్పే వరకూ చేరికలు కొనసాగుతాయని మాట్లాడడం హాస్యాస్పదం ఉందని రఘునందన్ రావు అన్నారు.


రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అయితే మీ అధినేత రాహుల్ గాంధీ చేతిలోని రాజ్యాంగం పుస్తకాన్ని మీ సెక్రటరీలతో చదివించుకోవాలని ఎంపీ హితబోధ చేశారు. అనంతరం ఆయన సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. దేశంలోని 736జిల్లాల్లో 550పై చిలుకు జిల్లా కార్యాలయాలను బీజేపీ నిర్మించినట్లు రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. త్వరలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డా చేతులమీదుగా సిద్ధిపేట కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. పార్టీ సంస్థగత నిర్మాణం కోసం కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నిర్మించిన బీజేపీ కార్యాలయాల ద్వారా డా.బీఆర్ అంబేడ్కర్ కలలు కన్న ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని ఎంపీ రఘునందన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

Rakesh Reddy: నిరుద్యోగులపై రేవంత్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి

Harish Rao:రాజకీయాల్లో అలా ఉండటం చాలా అరుదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

Updated Date - Jul 14 , 2024 | 03:26 PM