Free Bus Effect: బస్సులో సీటు కోసం మహిళల గొడవ
ABN , Publish Date - Jan 01 , 2024 | 07:20 PM
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కిందట మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే బస్సుల్లో సీటు కోసం పలువురు మహిళలు గొడవలకు దిగుతున్నారు. ఈ పథకం ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో తరచూ ఇలాంటి గొడవలు జరుగుతునే ఉన్నాయి.
జహీరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కిందట మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే బస్సుల్లో సీటు కోసం పలువురు మహిళలు గొడవలకు దిగుతున్నారు. ఈ పథకం ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో తరచూ ఇలాంటి గొడవలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా మరోసారి మహిళల మధ్య ఇలాంటి వాగ్వాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ నుంచి సగ్గారెడ్డి వెళ్లే బస్సులో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. బస్సులో మొదటగా ఓ మహిళ కర్చీఫ్ వేసింది. అయితే ఆ కర్చీఫ్‌ని తీసి వేరే మహిళ తన సీటులో కూర్చోంది. దీంతో కోపోద్రిక్తురాలైన మొదటి మహిళ ప్రయాణికురాలు.. ఆ తర్వాత సీటులో కూర్చున్న మహిళతో తగాదాకు దిగింది. ఇరువురి భీకరమైన ఫైటింగ్ జరిగింది. దీనికితోడు ఇద్దరి బంధువులు కూడా తీవ్రంగా కొట్టుకున్నారు. పలువురు మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని మరి కొట్టుకున్నారు.
మహిళల గొడవ చూసి బస్సులో ఉన్న ఓ చిన్నారి బోరున విలపించింది. దీంతో బస్సులో ఉన్న మహిళల మధ్య ఘర్షణను ఆపేందుకు ఇతర ప్రయాణికులు ప్రయత్నించారు. కాసేపటి తర్వాత మహిళల మధ్య గొడవ సద్దు మనిగింది. అయితే.. ఆ బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఆన్ లైన్‌లో వైరల్‌గా మారింది.