Share News

Duddilla Sridhar Babu: రూ.500 కోట్లతో మైక్రోలింక్‌ పరిశ్రమ

ABN , Publish Date - Jul 12 , 2024 | 03:31 AM

అమెరికాకు చెందిన టెలి కమ్యూనికేషన్‌ దిగ్గజం మైక్రోలింక్‌ నెట్‌వర్క్‌ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలకా్ట్రనిక్‌ , ఇతర ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

Duddilla Sridhar Babu: రూ.500 కోట్లతో మైక్రోలింక్‌ పరిశ్రమ

  • రాష్ట్రంలో ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల కేంద్రం: దుద్దిళ్ల

హైదరాబాద్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): అమెరికాకు చెందిన టెలి కమ్యూనికేషన్‌ దిగ్గజం మైక్రోలింక్‌ నెట్‌వర్క్‌ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలకా్ట్రనిక్‌ , ఇతర ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన పీఎ్‌సఆర్‌ ఇండస్ట్రీస్‌ భాగస్వామ్యంతో మైక్రోలింక్‌ పరిశ్రమల క్లస్టర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మైక్రోలింక్‌ గ్లోబల్‌ ప్రతినిధులు, పీఎ్‌సఆర్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ శ్రీరంగారావు నేతృత్వంలో గురువారం సచివాలయంలో మంత్రితో సమావేశం అయ్యారు.


రాబోయే మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ సంస్థ నుంచి ఎలకా్ట్రనిక్‌, ఐటీ, నిర్మాణ రంగ పరికరాలు ఉత్పత్తి అవుతాయని మంత్రి శ్రీధర్‌ బాబు వివరించారు. సుమారు 700 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటనలో మైక్రోలింక్‌ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. డేటా ట్రాన్స్‌ మిషన్‌, నెట్‌వర్కింగ్‌ కేబుల్స్‌, ఐవోటీ, మల్టీలెవల్‌ పార్కింగ్‌ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్‌ నెట్‌వర్క్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఉందని చెప్పారు. తెలంగాణలో నైపుణ్యం ఉన్న సిబ్బందికి కొరత లేదని ఆయన వెల్లడించారు.

Updated Date - Jul 12 , 2024 | 03:31 AM