TG Politics: పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇందిరమ్మ కమిటీలు: మంత్రి దామోదర రాజనర్సింహ
ABN , Publish Date - Apr 01 , 2024 | 10:15 PM
పార్లమెంటు ఎన్నికల తర్వాత ఊరురా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) అన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలోనే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.
సంగారెడ్డి జిల్లా: పార్లమెంటు ఎన్నికల తర్వాత ఊరురా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) అన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలోనే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. సోమవరాం నాడు జహీరాబాద్‌లో కాంగ్రెస్ (Congress) కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటములు కొత్త కాదన్నారు. ధరణి, 317 జీవో, జీవో 46 తెలంగాణకు శాపంగా మారాయని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజా స్వేచ్ఛను గౌరవించేది హస్తం పార్టీ అని అన్నారు.
Congress: కేసీఆర్ కుటుంబం తప్పా మిగతా నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
పదేళ్లు అధికారం కోల్పోయిన ప్రజల్లో ఉంటూ మళ్లీ అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఆరు గ్యారెంటీలో ప్రతి వాగ్దానానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే 120 రోజుల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పార్లమెంటు ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిద్దామని చెప్పారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు.
Rasamayi Balakishan: ముసలి నక్కలన్నీ కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నాయి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి