Share News

Uttam: మేడిగడ్డపై తుది నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Oct 11 , 2024 | 03:25 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల శాశ్వత పునరుద్ధరణపై చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ సత్వరమే

Uttam: మేడిగడ్డపై తుది నివేదిక ఇవ్వండి

  • డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్‌ను కోరనున్న ఉత్తమ్‌.. నేడు ఢిల్లీకి

హైదరాబాద్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల శాశ్వత పునరుద్ధరణపై చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ సత్వరమే తుది నివేదిక అందించాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎ్‌సఏ)ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి కోరనున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఎన్డీఎ్‌సఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌, కాళేశ్వరం బ్యారేజీల కమిటీ చైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌తో సమావేశం కానున్నారు. మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసింది. అయితే, జియో టెక్నికల్‌-ఫిజికల్‌, ఎలకో్ట్ర రెసిస్టివిటీటెస్ట్‌తో పాటు టోమోగ్రఫీ, భూ పరీక్షల తర్వాతే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎ్‌సఏస్పష్టం చేసింది.


గోదావరిలో వరద పెరగడంతో కొన్ని పరీక్షలనే ప్రభుత్వం చేయగలిగింది. వీటి నివేదికలతో పాటే మేడిగడ్డకు సంబంధించి సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎ్‌సఎంఆర్‌ఎస్‌)పరీక్ష నివేదికను అధికారులు ఢిల్లీలో ఎన్డీఎ్‌సఏకు అందజేశారు. శాశ్వత పునరుద్ధరణ చర్యలపై తుది నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరగా, మిగతా పరీక్షలను సైతం పూర్తి చేయాలని తేల్చిచెప్పారు. అధికారుల విజ్ఞప్తులకు ఎన్డీఎ్‌సఏ యంత్రాంగం స్పందించకపోవడంతో ఢిల్లీ వెళ్లాలని మంత్రి ఉత్తమ్‌ నిర్ణయించారు. వార్దాపై బ్యారేజీతో పాటు ప్రాణహితపై తుమ్మిడిహట్టికి దిగువన రబ్బర్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ రెండింటి నీళ్లను గ్రావిటీ ద్వారా సుందిళ్లకు తరలించి ఎల్లంపల్లిలోకి పంపింగ్‌ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు మేడిగడ్డ మినహా కాళేశ్వరంలోని ఇతర నిర్మాణాలన్నిటినీ వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

Updated Date - Oct 11 , 2024 | 03:25 AM