Share News

Purushotham Reddy: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పితృ వియోగం

ABN , Publish Date - Sep 30 , 2024 | 04:05 AM

రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి తండ్రి నలమాద పురుషోత్తంరెడ్డి (90) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

Purushotham Reddy: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పితృ వియోగం

  • నివాళులర్పించిన వివిధ పార్టీల నేతలు

హుజూర్‌నగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, సెప్టెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి తండ్రి నలమాద పురుషోత్తంరెడ్డి (90) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. భార్య ఉషాదేవితో కలిసి మసీద్‌బండలోని సైబర్‌ మెడో్‌సలో కుమార్తె హితశ్రీరెడ్డి నివాసంలో ఉంటోన్న ఆయన ఆదివారం అస్వస్థతకు గురికావడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని పరామర్శించారు.


మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మందకృష్ణ మాదిగ, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, రవిచంద్ర, మాజీ మంత్రి హరీ్‌షరావు, కేపీ వివేక్‌ తదితరులు నివాళులు అర్పించి సానుభూతిని తెలిపారు. అనంతరం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు, జీవన్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వేం నరేందర్‌రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


తుంగతుర్తి నియోజకవర్గంలోని తాటిపాములకు చెందిన నలమాద పురుషోత్తంరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రి కాగా, చిన్న కుమారుడు గౌతం రెడ్డి పారిశ్రామికవేత్త. కుమార్తె హితాశ్రీ గృహిణి. బీహెచ్‌ఈఎల్‌లో ఈడీగా పనిచేసిన ఆయన ఉద్యోగ విరమణ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

Updated Date - Sep 30 , 2024 | 04:05 AM