MLA: రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడం లేదు..
ABN , Publish Date - Apr 26 , 2024 | 10:59 AM
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులకు రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకావడం లేదని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medical MLA Chamakura Mallareddy) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రోరైల్‌లో ప్రయాణించి వినూత్న ప్రచారం చేశారు.
- మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులకు రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకావడం లేదని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medical MLA Chamakura Mallareddy) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రోరైల్‌లో ప్రయాణించి వినూత్న ప్రచారం చేశారు. ఎల్‌బీనగర్ నుంచి కూకట్‌పల్లి వరకు మెట్రోరైల్‌లో ప్రయాణించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు. గడిచిన నాలుగు నెలల కాలంలోనే చెరువులు, పొలాలు ఎండిపోయాయని, మహిళలకు పింఛన్లు రావడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో సునామి వచ్చినట్లు పరిస్థితులు మారిపోయాయని ఎద్దేవా చేశారు.
ఇదికూడా చదవండి: ఖమ్మం.. కాంగ్రెస్ జిల్లా అని చాటుతాం
పింఛన్లు, రైతుబంధు, రుణమాఫీ విషయంలో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాటతప్పిందన్నారు. పార్లమెంట్‌లో ప్రశ్నించే సత్తా ఉన్న బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అనంతరం బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి ప్రజలకు రేవంత్‌రెడ్డిపై నమ్మకం పోయిందని అన్నారు. స్థానికుడనైన తనకు ఓటువేసి గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, మల్లేశం, కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత, కూకట్‌పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: నేరగాళ్లతో దోస్తీ.. మంగళ్‌హట్ డీఐ సస్పెన్షన్
Read Latest National News and Telugu News