Share News

MLA: కబ్జాల నుంచి స్థలాలను కాపాడుకోలేని స్థితిలో వక్ఫ్‌బోర్డు

ABN , Publish Date - Nov 14 , 2024 | 10:42 AM

వక్ఫ్‌బోర్డు స్థలాన్నే కబ్జాల నుంచి కాపాడుకోలేని దుస్థితిలో వక్ఫ్‌బోర్డు పనిచేస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరెడ్డి(Malkajgiri MLA Marri Rajashekha Reddy) ఆరోపించారు. కబ్జా చేసిన వారికి పోలీసులు వత్తాసు పలకడం వెనుక ప్రభుత్వ పెద్దలెవరున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

MLA: కబ్జాల నుంచి స్థలాలను కాపాడుకోలేని స్థితిలో వక్ఫ్‌బోర్డు

- కబ్జాదారులపై చట్ట ప్రకారం కేసు పెట్టాలి

- వక్ఫ్‌బోర్డు తీరుపై ఎమ్మెల్యే మర్రి ఆగ్రహం

మల్కాజిగిరి(హైదరాబాద్): వక్ఫ్‌బోర్డు స్థలాన్నే కబ్జాల నుంచి కాపాడుకోలేని దుస్థితిలో వక్ఫ్‌బోర్డు పనిచేస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరెడ్డి(Malkajgiri MLA Marri Rajashekha Reddy) ఆరోపించారు. కబ్జా చేసిన వారికి పోలీసులు వత్తాసు పలకడం వెనుక ప్రభుత్వ పెద్దలెవరున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వక్ఫ్‌బోర్డు తీరు పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయం అన్నట్టుగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: కదలరు.. నడవరు.. తగ్గిన శారీరక శ్రమతోనే ముప్పు


మల్కాజిగిరి(Malkajgiri)లో 750 ఎకరాలు తమవే అన్న వక్ఫ్‌బోర్డు సీఈవో ప్రకటనతో పాటు ఆయా సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ చేసిన ప్రకటనతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటీవల వక్ఫ్‌బోర్డు రిజిస్ట్రేషన్ల నిలిపివేత కోరుతూ నిషేధిత సర్వే నంబర్లను ప్రకటించింది. అయితే, నిషేధిత జాబితాలో లేని 398, 399 సర్వే నంబర్లలో వివాదాస్పదంగా మారిన వక్ఫ్‌ భూములను సర్వే నిర్వహించి నిజాలు తేల్చాలని ఎమ్మెల్యే అన్నారు.


ప్రస్తుతం అందులో కబ్జాలో ఉన్న వారికి వక్ఫ్‌ చట్టం 52ఏ ప్రకారం నోటీసులిచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాల్సి ఉండగా.. సదరు వక్ఫ్‌ అధికారులు ఎవరికి బయపడుతున్నారో తెలియడంలేదన్నారు. ఈ సర్వే నంబర్లలోని దాదాపు 20 ఎకరాల భూమిని కబ్జాచేసిన వారికి పోలీసులే సహకరించడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్‌బోర్డు సీఈవోకు తెలియకుండానే కబ్జాలు జరుగుతున్నాయా? స్థానిక వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ముతవల్లి) సహకారం కబ్జా చేసిన వారికి లేదా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.


నియోజకవర్గంలోని దాదాపు 70 వరకు కాలనీలు, బస్తీలు నిషేధిత జాబితా సర్వే నంబర్లలో ఉన్నాయని, ఇప్పటి వరకు ఎవరికి నోటీసులు ఇవ్వని అధికారులు ఇప్పుడే ఎందుకు నోటీసులంటూ భయపెడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. కబ్జాకు పాల్పడిన వారిపై వక్ఫ్‌బోర్డు చట్టం 52ఏ ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: కొడంగల్‌ నుంచే రేవంత్‌ భరతం పడతాం

ఈవార్తను కూడా చదవండి: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం

ఈవార్తను కూడా చదవండి: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2024 | 10:42 AM