Share News

TG News: మాదిగలను కాంగ్రెస్ దూరం చేసుకోవద్దు: మోత్కుపల్లి నర్సింహులు

ABN , Publish Date - Apr 02 , 2024 | 07:49 PM

కాంగ్రెస్ (Congress) మాదిగలను దూరం చేసుకోవద్దని మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోందని.. రేవంత్ పాలనపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

TG News: మాదిగలను కాంగ్రెస్ దూరం చేసుకోవద్దు: మోత్కుపల్లి నర్సింహులు

హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) మాదిగలను దూరం చేసుకోవద్దని మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోందని.. రేవంత్ పాలనపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన కొనసాగిస్తోందని చెప్పారు. మాదిగ సమాజం చాలా వెనకబాటులో ఉందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మాదిగలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని విమర్శలు వస్తున్నాయన్నారు. ఒక మాదిగ బిడ్డగా తనకు బాధగా ఉందని చెప్పారు.

Komatireddy Venkatreddy: సికింద్రాబాద్ ఎంపీగా దానంను గెలిపించడమే మా బాధ్యత

మాదిగల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని అనుకుంటున్నానన్నారు. మాదిగల కోట మాదిగలకు ఇచ్చే విధంగా చూడాలని కోరారు. కాంగ్రెస్ మాదిగలకు దూరం కాకూడదని... దీన్ని సరిచేయాలని కాంగ్రెస్ పెద్దలకు వేడుకుంటున్నానని చెప్పారు. ఒక జాతికి అన్యాయం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేయాలని కోరారు. రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇది జరిగింది కాదని అందరికీ సమన్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ మాదిగల అభివృద్ధికి కట్టుబడి ఉన్న పార్టీ అని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

Kadiyam Srihari: బీజేపీ ఆకృత్యాలను అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీల వల్ల కాదు: కడియం శ్రీహరి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 07:59 PM