Share News

Road Accidents: రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి బలి

ABN , Publish Date - Dec 09 , 2024 | 03:13 AM

రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో తల్లి, కుమారుడు దుర్మరణం పాలయ్యారు.

Road Accidents: రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి బలి

  • బైక్‌పై వెళ్తుండగా ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి

  • ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు... తల్లి, కొడుకు దుర్మరణం

భిక్కనూరు, అశ్వారావుపేట రూరల్‌, గజ్వేల్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో తల్లి, కుమారుడు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌ నుంచి బాన్సువాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లక్ష్మి(49) ఆమె కుమారుడు అక్షయ్‌రెడ్డి(28) మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వేగంగా లారీని ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయి అక్షయ్‌రెడ్డి మృతదేహాం అందులో ఇరుక్కుపోయింది. మరో ఘటనలో.. మారథాన్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రాణమిత్రులైన ఇద్దరు కానిస్టేబుళ్లను మృత్యువు కబళించింది. పూస వెంకటేశ్వర్లు(42), పరంధాములు(43).. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌, రాయపోల్‌ పోలీ్‌సస్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు.


ఇద్దరు కలిసి మారథాన్‌లో పాల్గొనేందుకు బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తుండగా గజ్వేల్‌లోని జాలిగామ బైపాస్‌ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సిద్దిపేట సీపీ అనురాధతో పాటు ఉన్నతాధికారులు వచ్చి మృతదేహాలకు నివాళులర్పించారు. ఘటనపై ఎమ్మె ల్యే హరీశ్‌రావు దిగ్భాంతి వ్యక్తం చేశారు. అలాగే భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పరిధిలో జరిగిన మరో యాక్సిడెంట్‌లో ఇద్దరు యువకులు చనిపోయారు. వ్యవసాయ పనుల కోసం బైక్‌పై వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీ కొట్టడంతో స్థానికుడు బద్దె వెంకటేశ్వర్లు, ఏపీలోని ఏలూరుకు చెందిన సాయి మనోజ్‌కుమార్‌లు దుర్మరణం చెందారు. బైక్‌పై ఉన్న వీరభద్రం అనే మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Dec 09 , 2024 | 03:13 AM