Jagadish: మాట్లాడితే చివాట్లు తప్ప ఉత్తమ్ సీఎం కాలేరు..
ABN , Publish Date - Aug 31 , 2024 | 04:30 PM
Telangana: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పదవిపై ఉత్తమ్ పునరాలోచనల చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనాల్సిన మాటలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమపై వాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట, ఆగస్టు 31: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Former Minister Jagadish Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పదవిపై ఉత్తమ్ పునరాలోచనల చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనాల్సిన మాటలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమపై వాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘‘నీ కంటే వెనక వచ్చి సీఎం పదవి గుంజుకుంటే చేతగాని దద్దమ్మ ఉత్తమ్. ఏళ్లుగా కట్టిన ప్రాజెక్టుల నుండి నీటిని అందించడం చేతగాక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు’’ అంటూ మాజీ మంత్రి విరుచుకుపడ్డారు.
Harish Rao: ఆడపిల్లలు దు:ఖాన్ని ఆపులేకపోతున్నారు... మొద్దు నిద్ర వీడండి
నీళ్ళ కోసం, విద్యుత్ కోసం ధర్నాలు జరుగుతున్నాయని.. ముందు వాటి గురించి మాట్లాడాలని హితవుపలికారు. తిట్ల దండకం మాట్లాడితే చివాట్లు తప్ప ఉత్తమ్ సీఎం కాలేరన్నారు. సాగునీటి ధర్నాలు ఇలానే కొనసాగితే యాసంగి నాటికి ప్రజల్లో తిరగలేరన్నారు. ప్రజా ధనంతో హెలికాఫ్టర్లలో తిరుగుతూ ఉత్తమ్ సొల్లు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.
YSRCP: విదేశాలకు జగన్.. వైసీపీలో సంక్షోభం తప్పదా
సాగు నీరు అందించలేక ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ విఫలం అయ్యారన్నారు. చేతకాకపోతే మంత్రి పదవిపై ఉత్తమ్ పునరాలోచన చేయాలన్నారు. కాళేశ్వరం నీటిని అందించకపోతే కాంగ్రెస్ నాయకులకు రైతులతో దెబ్బలు తప్పవని హెచ్చరించారు. రైతాంగ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. త్వరలోనే కేసీఆర్ కార్యాచరణ వివరాలు వెల్లడిస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.