TS NEWS: రేవంత్ ఆ కేసును పక్కదారి పట్టిస్తున్నారు: జగదీశ్వర్ రెడ్డి
ABN , Publish Date - Feb 10 , 2024 | 07:13 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ తిరోగమన బడ్జెట్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి(Jagadishwar Reddy) ఆరోపించారు.
సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ తిరోగమన బడ్జెట్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి(Jagadishwar Reddy) ఆరోపించారు. శనివారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను ఆటకెక్కించిన బడ్జెట్ ఇదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని ఈ బడ్జెట్‌తో తేలిపోయిందన్నారు. గృహజ్యోతి అందరికీ అని చెప్పి మహిళలను మోసం చేశారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కొట్లాడటానికి తాము సిద్ధమేనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ కేంద్రంతో మాట్లాడకుండా తమపై ఎదురుదాడి చేస్తోందన్నారు. నల్గొండలో కేసీఆర్ చేపట్టే సభను చూసి రేవంత్ ప్రభుత్వం భయపడుతుందని దెప్పిపొడిచారు. ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే విచారణ పక్క రాష్ట్రాలకు మార్చాలని తాము డిమాండ్ చేస్తున్నామని జగదీశ్వర్ రెడ్డి అన్నారు.