Share News

Nerella Sharada: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద

ABN , Publish Date - Jul 18 , 2024 | 03:14 AM

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైౖర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బుధవారం హైదరాబాద్‌ బుద్ధ భవన్‌లోని కమిషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Nerella Sharada: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద

హైదరాబాద్‌, రాంగోపాల్‌పేట్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మహిళా కమిషన్‌ చైౖర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బుధవారం హైదరాబాద్‌ బుద్ధ భవన్‌లోని కమిషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ... తనను మహిళా కమిషన్‌ చైౖర్‌పర్సన్‌గా నియమించిన సీఎం రేవంత్‌ రెడ్డి, ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఽతెలంగాణను అత్యాచార రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు సీతక్క, శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు శారదను సన్మానించారు.

Updated Date - Jul 18 , 2024 | 03:14 AM