Bear Attack: పశువుల కాపరిపై దాడి చేసి..
ABN , Publish Date - Aug 13 , 2024 | 09:28 PM
లింగంపేట్ మండలం పోల్కంపేట్(Polkampet) గ్రామ పంచాయతీ పరిధిలో పశువుల కాపరిపై ఎలుగుబంటి(Bear) దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
కామారెడ్డి: లింగంపేట్ మండలం పోల్కంపేట్(Polkampet) గ్రామ పంచాయతీ పరిధిలో పశువుల కాపరిపై ఎలుగుబంటి(Bear) దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. చెరువుముందు తాండాకు చెందిన దేవసోత్ శ్రీనివాస్(24) అనే యువకుడు పశువులు మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అయితే గెదేలు మేత తింటుండగా పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. అదే సమయంలో ఎలుగుబంటిని గుర్తించిన శ్రీనివాస్ మెల్లిగా చెట్టు ఎక్కాడు. అయినా వాసనతో పసిగట్టిన భల్లూకం కూడా చెట్టు ఎక్కింది. అతని కుడి కాలిని పట్టుకుని తీవ్రంగా గాయపరిచింది.
తోటి కాపరులు దూరం నుంచి గట్టిగా అరవడంతో యువకుడిని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో వారంతా హుటాహుటిన బాధితుణ్ని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. భల్లూకం నుంచి ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దాన్ని బంధించాలంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. రైతులు, పశువుల కాపరులపై దాడి చేయడమే కాకుండా గ్రామాల్లోకి సైతం వచ్చే ప్రమాదం ఉన్నందున దాన్ని వెంటనే బంధించాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bhatti Vikramarka: విద్యార్థుల మృతిపై ఆరా తీసిన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్..
Minister Uttam: ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో భారీ దోపిడీ చేశారు: మంత్రి ఉత్తమ్..