Heavy Rains: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...
ABN , Publish Date - Sep 02 , 2024 | 10:39 AM
Telangana: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో సిరికొండ మండలం జలదిగ్బంధంలో ఉండిపోయింది.సిరికొండ మండలానికి ఇతర ప్రాంతాలకు రాకపోకల బంద్ అయ్యాయి. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
నిజామాబాద్, సెప్టెంబర్ 2: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో సిరికొండ మండలం జలదిగ్బంధంలో ఉండిపోయింది.సిరికొండ మండలానికి ఇతర ప్రాంతాలకు రాకపోకల బంద్ అయ్యాయి. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అత్యధికంగా జిల్లాలోని ధర్పల్లి మండలంలో 175.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవగా.. అత్యల్పంగా నిజామాబాద్ రూరల్ మండలంలో 38.5 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజి చరిత్రలో తొలిసారిగా రికార్డ్ స్థాయి వరద..
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో 16 గృహాలు నేలమట్టమయ్యాయి. వర్షాల నేపథ్యంలో నేడు (సోమవారం) పాఠశాలలు, కళాశాలకు జిల్లా యంత్రాంగంబంద్ ప్రకటించింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద ఉధృతి పెరగడంతో దిగువ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు సూచనలు చేశారు.
CM Revanth Reddy: అధికారులతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి..
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 1,57,274 క్యూసెక్కుల ఇన్ ప్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 80.5 టీఎంసీలులు కాగా ప్రస్తుతం 1087.9 అడుగులు, 69.57 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఎగువ నుంచి భారీ వరద కారణంగా మరికొద్ది సేపట్లోనే ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అటు నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 25024 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా... ప్రస్తుతం 1395.20 అడుగులుగా నమోదు అయ్యింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 6.987 టీఎంసీలుగా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
NRI: ముగిసిన ఆప్త 16వ వార్షికోత్సవం
Seethakka: భారీ వర్షాలపై మంత్రి సీతక్క సమీక్ష
Read Latest Telangana News And Telugu News