Earthquake: మేడారం మిస్టరీ.. రంగంలోకి దిగిన అధికారులు
ABN , Publish Date - Dec 04 , 2024 | 06:48 PM
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం అటవీ ప్రాంతంలో బుధవారం భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గతంలో ఇదే ప్రాంతంలో భారీ గాలులకు లక్షలాది చెట్లు నెలకొరిగాయి. మళ్లీ అదే ప్రాంతంలో భూమి కంపించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా, డిసెంబర్ 04: భూకంప కేంద్రం ఉన్నా.. మేడారం అడవులను ఫారెస్ట్ అధికారులు బుధవారం పరిశీలించారు. అడవికి నష్టం ఎలా జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మేడారం అడవుల్లో గతంలో చెట్లు కూలిన ప్రాంతాన్ని డీఎఫ్ఓ, ఎఫ్‌డీఓ పరిశీలించారు. మేడారం అడవుల్లో భూకంప కేంద్రం ఉందని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. నాలుగు నెలల క్రితం ప్రకృతి ప్రకోపం కారణంగా.. భారీ గాలులు వీచాయి. దీంతో లక్షలాది చెట్లు నెలమట్టమయ్యాయి.
Also Read: యూట్యూబ్‌లో మీకు సబ్ స్క్రైబర్లు పెరగడం లేదా? జస్ట్ ఇలా చేయండి
అదే ప్రాంతంలో భూకంప కేంద్ర నమోదు కావడంతో.. ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అటవీ శాఖ అధికారితోపాటు ప్రాంతీయ అటవీ శాఖ అధికారులు.. అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే అటవీ ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి నష్టం జరగలేదని నిర్ధారణకు వచ్చారు. గతంలో చెట్లు మాత్రమే ఒరిగినట్లు గుర్తించారు.
Also Read: జాక్ పాట్ కొట్టిన రేవంత్ ప్రభుత్వం
కానీ కొత్తగా ఎక్కడ ఎటువంటి నష్టం వాటిల్లలేదని వారు నిర్ధారణ చేశారు. ఇక భూకంప కేంద్రం మేడారం అడవుల్లోనే నమోదయి ఉండడంతో.. ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో వారి సూచనల మేరకు ఆగ మేఘాల మీద.. మేడారం అడవుల్లోకి వెళ్లి పరిశీలన చేపట్టారు. అదే సమయంలో భారీ వర్షం సైతం కురిసింది.
Also Read: ఆ విషయం.. మా హోం మినిస్టర్ భువనేశ్వరి చూసుకుంటారు
అయితే వర్షం సైతం కేవలం మేడారం అడవుల్లోనే కురిసింది. మిగత ప్రాంతంలో వర్షం లేక పోవడాన్ని సైతం అధికారులు గుర్తించారు. భూకంపం గురైన ప్రాంతంలోనే వర్షం కురవడం దేనికి సంకేతం అనే కోణంలో ఉన్నతాధికారులు పరిశీలన చేపట్టారు.
Also Read: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు చెప్పిన శ్రీహర్షిత
మరోవైపు ఈ మేడారం అటవీ ప్రాంతంలోనే గోదావరి నది సైతం ప్రవహిస్తుంది. ఆ గోదావరి నది బెల్ట్‌లో భారీగా భూ ప్రకంపనలు చెలరేగినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సైతం ఇదే ప్రాంతంలో నిర్మించి ఉండడం.. నీటిని నిల్వ చేసి ఉండడం..ఆ ఒత్తిడితోటి భూమి పొరల్లో జరిగిన సర్ధుబాటు అనే చర్చ సైతం సాగుతుంది. శాస్త్రవేత్తలు సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
గతంలో ఇదే ప్రాంతంలో.. 2018లో మేడారం జాతర సందర్భంగా చిలకలగుట్ట మీద గాలుల బీభత్సం సృష్టించాయి. అదే విధంగా 2023, ఆగస్ట్ 31న ఇదే ప్రాంతాంలో భారీ గాలులు వీచాయి. దీంతో లక్షలాది చెట్లు నెలకొరిగాయి. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదు కావడంతో.. ములుగు జిల్లా వ్యాప్తంగా ఓ విధమైన ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అదే ప్రాంతంలో మేడారం వన దేవతలుంటారు. దీంతో వనదేవతల ప్రకోపమా? లేకుంటే.. మానవ తప్పిదమా? అనే కోణంలో చర్చ అయితే సాగుతుంది.
For Telangana News And Telugu News