Share News

TG Politics: దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి.. హైకోర్టులో కౌశిక్ రెడ్డి పిటిషన్

ABN , Publish Date - Apr 10 , 2024 | 09:21 PM

ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా ప్రతినిథ్య చట్టం ప్రకారం దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

TG Politics: దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి.. హైకోర్టులో కౌశిక్ రెడ్డి పిటిషన్
Paadi Kaushik Reddy File Petition Disqualification Of Mla Daanam Nagender

హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై (Danam Nagender) అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో (Congress) చేరారు. ప్రజా ప్రతినిథ్య చట్టం ప్రకారం దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇదే అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ దృష్టికి తీసుకెళదామని ప్రయత్నించామని పిటిషనర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. దానం నాగేందర్‌పై అనర్హతకు సంబంధించిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

Telangana: మెదక్‌లో కాంగ్రెస్ సమావేశం.. బీఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సంచలన వ్యాఖ్యలు..

AP Politics: సర్వేపల్లిలో మితిమీరిన మంత్రి కాకాణి అల్లుడు ఆగడాలు: మాజీమంత్రి సోమిరెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 10 , 2024 | 09:21 PM