Home » Danam Nagender
నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని, ఒకవైపు అభివృద్ధి పనులు, మరోవైపు సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) అన్నారు.
కనీవిని ఎరుగని రీతిలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.
మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య మంచు కురుస్తుండగా కాశ్మీర్ అందాలను స్వయంగా చూస్తున్నట్లు అనుభూతి పొందేలా ఏర్పాటైన వింటర్ ఉత్సవ్ మేళా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
పేదల ఇళ్ల జోలికి వెళ్లడం తొందరపాటు నిర్ణయమే అవుతుందని, బాధితుల్లో భరోసా కల్పించేందుకు నిజనిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరనున్నట్టు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.
కూలగొట్టే ముందు హైడ్రా అక్కడి వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయన్నారు. ఒక చిన్నారి తన పుస్తకాలు ఇంట్లో ఉన్నాయని బోరున ఎడ్చిందని...
తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం రేవంత్రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Dana Nagender) అన్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాలు, చెరువులు అన్యాక్రాంతమయ్యాయన్నారు.
బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశంపై శాసన సభాపతి నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్ట్ ఆదేశించిన నేపథ్యంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే.. సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) అన్నారు.
‘ఇయ్యాల అధికారిగా ఉంటావు. రేపు వెళ్తావు. మేము ఇక్కడే పుట్టి పెరిగినవాళ్లం. ఇక్కడే ఉంటాం. రిటైర్గానే మీ ఊరికి వెళ్తావు. వంద కేసులు పెట్టినా నేను భయపడను. ప్రజల దగ్గరకు పోతాను. అధికారులపై ప్రివిలేజ్ మోషన్ (హక్కుల ఉల్లంఘన) నోటీసు ఇస్తా. నా నియోజకవర్గంలోకి పోవద్దని చెప్పడానికి వారికేం అధికారమున్నది.
ఏటా గంగపుత్రులు నిర్వహించే గంగ తెప్పోత్సవం ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది.