PM Modi: జహీరాబాద్‌లో ప్రధాని మోదీ అదిరిపోయే స్పీచ్..
ABN , Publish Date - Apr 30 , 2024 | 04:58 PM
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎటుచూసినా ఎలక్షన్ హీట్ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచేశాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు విచ్చేశారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కించుకోవాలన్నదే టార్గెట్‌గా కమలనాథులు పావులు కదుపుతున్నారు...
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ పంచసూత్రాల పాలన ప్రజలకు అర్థమైంది
దేశంలో మళ్లీ పాతరోజులు తీసుకురావాలని కాంగ్రెస్ యత్నం
తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు
డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలుచేసి ఢిల్లీలో కప్పం కడుతున్నారు
డబుల్ ఆర్ ట్యాక్స్ తక్షణమే అడ్డుకోవాలి
డబుల్ ఆర్ ట్యాక్స్ కడుతున్న వ్యాపారులు, కాంట్రాక్టర్లు
పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మన సంపదపై పన్ను వేస్తారు
మన సంపదలో 55 శాతాన్ని కాంగ్రెస్ తీసుకుంటుంది
మొన్నటివరకు తెలంగాణను BRS దోచుకుంది
ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను దోచుకుంటోంది
BRS పాలనలో కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణం
BRS పాలనలో ఓటుకు నోటు కేసును తొక్కిపెట్టింది
కాంగ్రెస్, BRS వేర్వేరు కాదు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం స్కాంపై కాంగ్రెస్ మాట్లాడింది
అధికారంలోకి రాగానే కాళేశ్వరం స్కాంను కాంగ్రెస్ తొక్కిపెట్టింది
స్కాంలపై కాంగ్రెస్, BRS నేతలు సహకరించుకుంటున్నారు
కాంగ్రెస్, BRS రెండూ తోడుదొంగలే
వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది
క్వింటాకు రూ.500బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ నెరవేరలేదు
బీజేపీ వల్లే మహిళలకు రక్ష
అయోధ్యలో రామమందిరం నిర్మాణం మోదీ వల్ల కాదు.. మీ ఓటు వల్లే సాధ్యమైంది
హైదరాబాద్‌లో పండుగలు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలు ఉన్నాయి
ఓ వర్గం ఓట్ల కోసమే హైదరాబాద్‌లో పండుగలపై ఆంక్షలు విధించారు
కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాలరాసింది
ఓబీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ముస్లింలకు ఇచ్చింది: మోదీ
ఓట్ల కోసమే ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది
రిజర్వేషన్లు, రాజ్యాంగంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది
రాజ్యాంగంపై, అంబేడ్కర్‌పై కాంగ్రెస్‌కు గౌరవం లేదు: ప్రధాని మోదీ
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎటుచూసినా ఎలక్షన్ హీట్ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచేశాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తెలంగాణకు విచ్చేశారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో (TS Lok Sabha Elections) ఎక్కువ సీట్లు దక్కించుకోవాలన్నదే టార్గెట్‌గా కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి నేతలు తెలంగాణలో వాలిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా.. తాజాగా మోదీ విచ్చేశారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రధాని అదిరిపోయే ప్రసంగం చేస్తున్నారు. జహీరాబాద్‌లో జరుగుతున్న భారీ బహిరంగ సభను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్‌లో వీక్షించండి..
Read Latest Telangana News And Telugu News