Lok sabha Elections: ఆ రాష్ట్రాల్లో లోక్‌సభ ఏడో దశ ఎన్నికలు..
ABN , Publish Date - May 31 , 2024 | 03:10 PM
లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈసారి ఢిల్లీ పీఠం కోసం జరుగుతున్న ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఎన్డీయే, ఇండియా కూటమి ఎత్తులు పైఎత్తులతో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదిపాయి. ఎట్టకేలకు రేపు ఏడో దశ పోలింగ్‌తో లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు తెరపడనుంది.
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) చివరి దశకు చేరుకున్నాయి. ఈసారి ఢిల్లీ పీఠం కోసం జరుగుతున్న ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఎన్డీయే, ఇండియా కూటమి ఎత్తులు పైఎత్తులతో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదిపాయి. ఎట్టకేలకు రేపు ఏడో దశ పోలింగ్‌తో లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు తెరపడనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.
ఏడో విడత పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విడతలో 8రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బిహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9స్థానాలకు సహా ఒడిశాలో 42అసెంబ్లీ స్థానాలకూ కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించనుంది.
రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగే పోలింగ్‌లో 10.06కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. దీని కోసం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.09లక్షల పోలింగ్ కేంద్రాలను సీఈసీ ఏర్పాటు చేసింది. 10.06కోట్ల మందిలో 5.24కోట్ల మంది పురుషులు, 4.82కోట్ల మంది మహిళలు, 3574మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది.
For Latest News and National News click here