Share News

Ponnam Prabhakar: బీఆర్‌ఎస్‌ నేతల్లో ఇంకా అదే అహంకారం

ABN , Publish Date - Sep 16 , 2024 | 04:21 AM

ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు జనం బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల్లో మార్పు కనిపిస్తలేదని.. ఇంకా అదే అహంకారాన్ని చూపుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు.

Ponnam Prabhakar: బీఆర్‌ఎస్‌ నేతల్లో ఇంకా అదే అహంకారం

  • గాంధీ, కౌశిక్‌రెడ్డి గొడవ ఆ పార్టీ వ్యవహారం: పొన్నం

వర్గల్‌, సెప్టెంబరు 15: ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు జనం బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల్లో మార్పు కనిపిస్తలేదని.. ఇంకా అదే అహంకారాన్ని చూపుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు గాంధీ, కౌశిక్‌రెడ్డి గొడవ బీఆర్‌ఎస్‌ అంతర్గత వ్యవహారమని, ఆ ఘర్షణతో కాంగ్రె్‌సకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం గౌరారంలో ఆయన మీడియాతో మాట్లాడారు.


ఎమ్మెల్యేల ఘర్షణపై బీఆర్‌ఎస్‌ రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. అప్పట్లో కేసీఆర్‌ ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనే కుట్రతో ఫిరాయింపులకు ఆజ్యం పోయగా.. ప్రస్తుతం ఆ పాపం వారికే చుట్టుకుందన్నారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి అద్భుత పథకాల అమలుతో ఆదరణ పొందుతుంటే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నిబంధనల ప్రకారం పీఏసీ చైర్మన్‌ పదవి గాంధీకి ఇచ్చాం. గతంలో మిత్రపక్షమైన ఎంఐఎంకు ఇచ్చిన విషయాన్ని వారు మర్చిపోయినట్లున్నారు’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Sep 16 , 2024 | 04:21 AM