Share News

Ponnam Prabhakar: 24/7 పనిచేయాలి..

ABN , Publish Date - Sep 04 , 2024 | 09:05 AM

ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించినందున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని మంత్రి కోరారు.

Ponnam Prabhakar: 24/7 పనిచేయాలి..

- విపత్తు వేళ అధికారులకు మంత్రి ఆదేశం

- హిమాయత్‌సాగర్‌ను పరిశీలించిన పొన్నం

- జలాశయం పూర్తిగా నిండే చాన్స్‌

- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

నార్సింగ్‌(హైదరాబాద్): ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించినందున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని మంత్రి కోరారు. 33 జిల్లాల కలెక్టర్లు, గ్రామ కార్యదర్శి మొదలు సీఎస్‌ వరకు 24/7 అధికారులందరూ పనిచేయాలని ఆదేశించారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‏గౌడ్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అనుదీప్‌ దురిశెట్టి, శశాంకతో కలిసి హిమాయత్‌సాగర్‌ జలాశయాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు.

ఇదికూడా చదవండి: Mahabubabad : సీఎం అంకుల్‌.. ఇది నావంతు


ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ హిమాయత్‌సాగర్‌ జలాశయం(Himayatsagar Reservoir) నిండినా, దిగువున ఉన్న ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. 5 వేల క్యూసెక్కుల నీళ్లు వస్తే, 10 గంటల్లో జలాశయం నిండి ఓవర్‌ ఫ్లో అవుతుందని, ప్రభుత్వపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విపత్కర సమయంలో రాజకీయాలు చేయడం తగదని విపక్షాలకు సూచించారు. అసెంబ్లీలో, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాల గురించి చూసుకుందామన్నారు.


ఒకరు అమెరికాలో, మరొకరు ఫాంహౌస్‏లో ఉండి సోషల్‌మీడియా వేదికగా విమర్శలు చేయడం సరికాదన్నారు. భారీ వర్షాలకు 5వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. తక్షణం 2 వేల కోట్లు ఆర్థిక సహకారం చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. మంత్రి వెంట బండ్లగూడ మేయర్‌ లతాప్రేమ్‌గౌడ్‌, తెలంగాణ ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బి.జ్ఞానేశ్వర్‌, ఇరిగేషన్‌ అధికారులు ఉన్నారు.


..........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

............................................................................

Hyderabad: నిండుకుండలా 33 చెరువులు..

- గ్రేటర్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం

హైదరాబాద్‌ సిటీ: భారీ వర్షాలతో గ్రేటర్‌ పరిధిలో 33 చెరువులు నిండుకుండలా మారాయి. ఎగువప్రాంతాల నుంచి వచ్చే వరదనీటితో కళకళలాడుతున్నాయి. హుస్సేన్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 2,184 క్యూసెక్కులు కాగా 1751 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు.

ఆ చెరువులు ఇవే..

కూకట్‌పల్లి మండల(Kukatpally Mandal) పరిధిలోని రంగధాముని కుంట, ముళ్ల కత్వ, మైసమ్మచెరువు, కాముని చెరువు, పరికి చెరువు, శేరిలింగంపల్లి మండల పరిధిలోని తుమ్మిడికుంట, గోపీచెరువు, చాకలవాని, నల్లగండ్ల, మల్కచెరువు, పెద్దచెరువు, ఖైదమ్మకుంట, ఈర్లచెరువు, కుత్బుల్లాపూర్‌ మండల పరిధిలోని పెద్దచెరువు, కలమన్నకుంట, వెన్న చెరువు, లింగం చెరువు, హెచ్‌ఎంటీ లేక్‌, బోయిన్‌చెరువు (హస్మత్‌పేట), పెద్ద చెరువు (నాచారం), బందెలగూడ చెరువు (బందెల గూడ), పటేల్‌ చెరువు (నాచారం), నల్లచెరువు (ఉప్పల్‌), నాగిరెడ్డికుంట - యాప్రాల్‌ చెరువు (యాప్రాల్‌), మీరాలంట్యాంక్‌ (బహదూర్‌పురా), ఎల్లమ్మ చెరువు (మణికొండ), లంగర్‌హౌస్‌ ట్యాంక్‌ (గోల్కొండ), హుస్సేన్‌సాగర్‌ (దోమలగూడ), లోటస్‌పాండ్‌ (హకీంపేట), కొత్త చెరువు (షేక్‌ పేట), బతూర్‌కుంట (షేక్‌పేట), సాకి, పఠాన్‌చెరువులు ఉన్నాయి.

city1.2.jpg


మూడు జిల్లాల్లో అధిక వర్షపాతం..

మూడు రోజులుగా కురిసిన వర్షాలతో ఈ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 3వ వరకు హైదరాబాద్‌ జిల్లాలో సాధారణంగా 480.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 591.1 మిల్లీమీటర్ల వర్షపాతంతో 23 శాతం అధికంగా నమోదైంది. మేడ్చల్‌- మల్కాజిగిరి(Medchal- Malkajigiri) జిల్లాలో సాధారణంగా సెప్టెంబర్‌ 3 నాటికి 406.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 596.1 మిల్లీమీటర్లతో 46 శాతం అధికంగా నమోదైంది. రంగారెడ్డి(Ranga Reddy) జిల్లాలో ఈ సీజన్‌లో సెప్టెంబర్‌ 3 నాటికి 414.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 441.8 మిల్లీమీటర్ల వర్షపాతంతో 7 శాతం అధికంగా నమోదైంది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 04 , 2024 | 09:05 AM